మనీష్ సిసోడియా కోర్టులో హాజరుపర్చిన సీబీఐ.. తీర్పుపై ఉత్కంఠ!

by GSrikanth |
మనీష్ సిసోడియా కోర్టులో హాజరుపర్చిన సీబీఐ.. తీర్పుపై ఉత్కంఠ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. సోమవారం మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా వాదనలు వినిపించిన సీబీఐ ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని అందువల్ల మనీష్ సిసోడియాను ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని కోరింది. మరో వైపు ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని మనీష్ సిసోడియా న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది.

తన భార్య ఆరోగ్య పరిస్థితి బాలేదని బెయిల్ ఇవ్వాలని సిసోడియా కోర్టును కోరే అవకాశం ఉంది. దీంతో కోర్టు నిర్ణయం ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు సిసోడియా అరెస్ట్‌తో ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. బీజేపీ కార్యాలయానికి వెళ్లేందుకు ఆప్ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు కాంప్లెక్స్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story