CPM ప్రధాన కార్యదర్శి Sitaram Yechury మునుగోడు బై ఎలక్షన్ పై కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2022-09-09 13:16:42.0  )
CPM ప్రధాన కార్యదర్శి Sitaram Yechury మునుగోడు బై ఎలక్షన్ పై కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యం అయింది. అయితే ఈ ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు తలపడనున్నాయి. ఈ క్రమంలో గతం లో వామపక్షాలు ఇక్కడ ఐదు సార్లు గెలవడం తో లెఫ్ట్ పార్టీలు పోటీ చేస్తారా.. లేక ఏ పార్టీకైనా మద్దతు ప్రకటిస్తారా.. అనే చర్చ జరిగింది. సీపీఎం కంటే ముందుగానే సీపీఐ పార్టీ టీఆర్‌ఎస్ పార్టీ కి మద్దతు తెలిపారు. ఆ తర్వాత సిపిఐ బాటలో సీపీఎం కూడా అడుగులు వేసింది. మొదట కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుదామని అనుకున్నా కాంగ్రెస్ లో అంతర్గత పోరు వల్ల గెలవడం కష్టం మని వామపక్షాలు భావించాయి. ఇప్పటి పరిస్థితుల్లో బీజేపీ ని ఎదుర్కునే సత్తా టీఆర్‌ఎస్ కు మాత్రమే ఉందని తేల్చిచెప్పారు లెఫ్ట్ పార్టీ నాయకులు. ఇదే విషయాన్ని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా వెల్లడించారు. అంతేకాకుండా 2024 సాధారణ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాలన్నీ ఏకమవుతున్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలు హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా శుక్రవారం ఢిల్లీలో సీతారాం ఏచూరి తో భేటీ అనంతరం ఏచూరి మీడియాకు వెల్లడించారు.

Also Read: రూటు మార్చిన ఒవైసీ.. ఈ సారి కేసీఆర్ కు షాక్ తప్పదా?

Advertisement

Next Story