- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ నేతలను నిలదీసిన సీపీఐ నారాయణ
దిశ, తిరుపతి: తిరుపతి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ నేతలను తిరుపతి ప్రజలు చీ కొట్టాలని, రాష్ట్ర గవర్నర్ అభివృద్ధి వైపు స్పందించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. టీటీడీ వారు తిరుపతికి కేటాయించిన 1 శాతం నిధులపై జిల్లాలో, రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న ధర్నాలు గవర్నర్‌కు అర్జీలు ఇవ్వడాన్ని నారాయణ తీవ్రంగా తప్పుబట్టారు.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. మూర్ఖత్వపు విశ్వహిందూ పరిషత్, బీజేపీ నేతలు తిరుపతి అభివృద్ధి నిరోధక శక్తులుగా ఉన్నారని, వీరి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తిరుమలకు భక్తులు రోజూ లక్షకు పైగా వస్తుంటారని తిరుపతి ఎంత అందంగా ఉంటే భక్తులు అంత ఆనంద పడతారని తెలిపారు. తిరుపతి అభివృద్ధికి రూ.4 వేల కోట్ల ఆదాయంలో 1 శాతం అంటే కేవలం రూ. 40 కోట్లు మాత్రమేనని, ఇది ఏ మాత్రం సరిపోదని అవసరమైతే తిరుపతి మౌళిక సదుపాయాల కోసం 5 శాతం నిధులు కేటాయిస్తే మంచిదని ఆయన డిమాండ్ చేశారు.