- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CPI Narayana's : విమాన టికెట్ల ధరలను నియంత్రించండి : కేంద్ర మంత్రికి సీపీఐ నారాయణ లేఖ
దిశ, వెబ్ డెస్క్ : విమాన టికెట్ల ధరలను నియంత్రించాలని(Control air ticket prices) కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు(Union Civil Aviation Minister Rammohan Naidu)కు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI National Secretary Narayana) లేఖ రాశారు. విమాన ప్రయాణికులను విమాన సంస్థలు దోచుకుంటున్నాయని లేఖలో మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి మౌలిక సదుపాయాలు పొందుతున్న ప్రైవేట్ విమానయాన సంస్థలు అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచుతూ దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. ప్రయాణ దూరం మారనప్పుడు టికెట్ ధరలు ఎలా పెంచుతారని ప్రశ్నించారు. భారత్ దేశ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని విమాన టికెట్ ధరలు నిర్ణయించాలన్నారు. విమానయాన శాఖ ప్రజల కోసం పని చేయాలేగాని, ప్రవేటు విమాన రంగ సంస్థల కోసం కాదని హితవు పలికారు. టికెట్ల ధరలు కార్పోరేట్ వ్యక్తులకే కాదు.. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా ఉండాలన్నారు. విమానయాన సంస్థల టికెట్లు ధరలను నియంత్రించకపోతే అది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అవుతుందన్నారు.
రైళ్లలోనూ వందేభారత్ పేరుతో కేంద్రం టికెట్ ధరలను పెంచి మెజార్టీ ప్రజలకు భారం చేసిందని విమర్శించారు. ప్రజా రవాణా భద్రతలో మాత్రం విఫలమవుతుందని ఆరోపించారు. వరుసగా వందల సంఖ్యలో విమానయాన సంస్థలకు, రైళ్ళకు బాంబు బెదిరింపులు వస్తుంటే ఇంటలిజెన్స్ విభాగం ఏం చేస్తుందని ప్రశ్నించారు. సైకలాజికల్ టెర్రర్ కు గురి చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో ఉగ్ర మూకలు రెచ్చిపోతున్నాయన్నారు. ప్రపంచంలో ఆకలి సూచిక హంగర్ ఇండెక్స్ లో ఇండియా 105వ స్థానంలో ఉండటం కేంద్ర ప్రభుత్వ అసమర్ధ పాలనకు నిదర్శనమని ఎద్దేవా చేశారు.