- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జోడో యాత్ర ఊపులో కాంగ్రెస్ మరో యాత్ర!
న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్రకు వచ్చిన స్పందనతో కాంగ్రెస్ మరో యాత్ర నిర్వహించేందుకు సిద్ధమైంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారికి యాత్రను దృష్టిలో పెట్టుకుని తూర్పు నుంచి పడమరకు పాసిఘాట్-పోరుబందర్ యాత్ర చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ తెలిపారు. ఈ యాత్ర భారత్ జోడో యాత్రకు భిన్నంగా అరుణాచల్ ప్రదేశ్ పాసిఘాట్ నుంచి గుజరాత్ పోరుబందర్ వరకు సాగేలా ప్రణాళికలు చేస్తున్నారు. ‘మరో యాత్రకు చాలా ఉత్సాహం, శక్తి ఉంది. వ్యక్తిగతంగానూ ఇది అవసరమని అనుకుంటున్నాను, అయితే తూర్పు నుండి పడమర యాత్ర దక్షిణం నుండి ఉత్తరం వరకు జరిగిన భారత్ జోడో యాత్రకు భిన్నంగా ఉండవచ్చు’ అని రమేష్ అన్నారు.
అయితే భారత్ జోడోయాత్రకు ఉన్నంత విస్తృతంగా, ఎక్కువ సంఖ్యలో యాత్రికులు ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఇది అడవులు, నదుల గుండా సాగే యాత్ర చెప్పారు. కర్ణాటకలో ఎన్నికలు.. జూన్‌లో వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకుని జూన్ ముందు లేదా, నవంబర్ ముందు యాత్రను నిర్వహించనున్నట్లు చెప్పారు. దీనిపై రాబోయే రోజుల్లో అధికార ప్రకటన ఉంటుందని చెప్పారు. అయితే రాహుల్ గాంధీ నేతృత్వంలో యాత్ర సాగుతుందా అనే అంశమై ఇంకా తేలాల్సి ఉంది.