కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ: Minister Mallareddy

by Kalyani |   ( Updated:2023-07-12 10:14:07.0  )
కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ: Minister Mallareddy
X

దిశ, మేడ్చల్ టౌన్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు బిచ్చం అడుక్కోవడానికి అమెరికా వెళ్లాడని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఘాటుగా విమర్శించారు.. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని అన్నారు. రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయం కోసం 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తుంటే ఓర్వలేక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 3 గంటలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరిపోతుందని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. బుధవారం మేడ్చల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ తో కలిసి మంత్రి మల్లారెడ్డి టీపీసీసీ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతులను రాజులను చేసేందుకు కృషి చేస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం రైతులకు ఉచిత కరెంట్ వద్దన్న రీతిలో మాట్లాడటం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్ నేతల తీరును గమనిస్తున్నారని, వారికి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అనంతరం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపిక నరసింహారెడ్డి, ఎంపీపీ రజిత రాజ మల్లారెడ్డి, గుండ్ల పోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ మద్దుల లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, రైతు జిల్లా సమన్వయ సమితి అధ్యక్షుడు నందా రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, మేడ్చల్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Read More: రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీని ప్రజలు తరిమికొట్టాలి : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

Advertisement

Next Story

Most Viewed