- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరువు నష్టం కేసుపై అప్పీల్‌కు రాహుల్ గాంధీ
దిశ, డైనమిక్ బ్యూరో : పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్ కోర్టు తనపై విధించిన రెండేళ్ల జైలు శిక్షను సవాల్ చేసేందుకు కాంగ్రెస్ అగ్ర నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం(రేపు) సూరత్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిసింది. న్యాయనిపుణులతో కలిసి ఇప్పటికే పిటిషన్‌ను తయారు చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో తనని దోషిగా తేలుస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని రాహుల్ తన పిటిషన్‌లో కోరనున్నట్లు తెలుస్తోంది.
అలాగే సెషన్స్ కోర్టులో దీనిపై తీర్పు వెలువడే వరకు తనను దోషిగా తేల్చిన ట్రయల్ కోర్టు తీర్పుపై మధ్యంతర స్టే ఇవ్వాలని రాహుల్ అభ్యర్థించనున్నట్లు సమాచారం. 2019లో మోడీ ఇంటిపేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల కారణంగా నమోదైన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు వల్ల రాహుల్ తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. అంతేకాకుండా, అధికారిక నివాసాన్ని కూడా ఖాళీ చేయాలని ఆదేశించింది.