జైలు శిక్ష పడిన వ్యక్తికి సిట్ బాధ్యతలా?: గవర్నర్​ కు బక్క జడ్సన్ ​ఫిర్యాదు

by Javid Pasha |
జైలు శిక్ష పడిన వ్యక్తికి సిట్ బాధ్యతలా?: గవర్నర్​ కు బక్క జడ్సన్ ​ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జైలు శిక్ష పడిన వ్యక్తికి సిట్ బాధ్యతలు ఏంటని కాంగ్రెస్​ నేత బక్క జడ్సన్​ ప్రశ్నించారు. ఆయనను వెంటనే తొలగించాలని, అప్పుడే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు టీఎస్​పీఎస్సీ అక్రమల పై దర్యాప్తు చేసేందుకు జైల్ శిక్ష ముగిసిన వ్యక్తిని సిట్ భాద్యతల నుండి తొలగించాలని ఆయన బుధవారం గవర్నర్​ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జడ్సన్​మాట్లాడుతూ..గతంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ 48 గంటల్లోటీఎస్​పీఎస్సీ నుండి నివేదిక కోరారని, కానీ ఇప్పటి వరకు రిపోర్టు ఇవ్వకపోవడం దారుణమన్నారు.పేపర్ లీకేజీలో నిందితులను అరెస్టు చేసినప్పటి నుంచి టీఎస్‌పీఎస్సీపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయన్నారు.

టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ డాక్టర్ బి జనార్దన్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని, సిట్టింగ్ జడ్జితో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలన్నారు.ప్రస్తుత పరిస్థితిలో పోలీసు శాఖ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పని చేస్తోందని ఆరోపించారు.గత ఎనిమిదేళ్లలో ఏర్పాటైన అన్ని సిట్ కమిటీలు వారి ఆసక్తిని, క్విడ్ ప్రో కలెక్షన్లను కాపాడుకోవడానికి మాత్రమే పనిచేశాయన్నారు.టాలీవుడ్ డ్రగ్స్ స్కాండల్​,హై ప్రొఫైల్ జూబ్లీ హిల్స్ రేప్ కేసు, ల్యాండ్ మాఫియా కుంభకోణాలు, కిడ్నాప్ ,దోపిడీ మొదలైన వాటిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు. దీంతోనే ఈ ప్రజాస్వామ్యంలో నిరుద్యోగ యువతకు రక్షణ కల్పించేందుకు, అన్ని స్థాయిల దోషులను తక్షణమే విచారణ జరగాలంటే సీబీఐకి, ఈడీ, ఏసీబీ లతో ఎంక్వైరీ జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి అయిత గిరిబాబు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు .

Advertisement

Next Story

Most Viewed