లిక్కర్ స్కామ్ వ్యవహారంపై CBI విచారణ చేయాలి: భట్టి

by GSrikanth |
లిక్కర్ స్కామ్ వ్యవహారంపై CBI విచారణ చేయాలి: భట్టి
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. లిక్కర్ పాలసీ స్కామ్‌లో సంబంధం ఉన్న వారందరిపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ మద్యం విధానం, తెలంగాణ మద్యం విధానం ఒక్కటే అని అన్నారు. తెలంగాణలో ఇంకెంత స్కామ్ జరిగిందోనని అనుమానాలు ఉన్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మద్యం స్కామ్ దేశాన్ని కుదిపేస్తోందని, ఢిల్లీ లిక్కర్ స్కామ్.. దేశంలోనే అతిపెద్ద స్కామ్ అంటున్నారని వెల్లడించారు. ఢిల్లీ స్కామ్‌తో తెలంగాణకు సంబంధాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయని గుర్తుచేశారు.

Advertisement

Next Story