మీకు మంత్రి పదవి ఇచ్చిన వ్యక్తే ఈ సంప్రదాయం తెచ్చాడు!

by GSrikanth |   ( Updated:2023-06-09 06:36:13.0  )
మీకు మంత్రి పదవి ఇచ్చిన వ్యక్తే ఈ సంప్రదాయం తెచ్చాడు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: విదేశాలకు వెళ్లినప్పుడు భారత్‌పై విమర్శలు గుప్పించడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందంటూ విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ చేసిన విమర్శలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. జైశంకర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ మండిపడ్డారు. విదేశాల్లో మన దేశ రాజకీయాల గురించి విదేశాల్లో మాట్లాడే సంప్రదాయం ప్రారంభించింది రాహుల్ గాంధీ కాదని ఆ పనిని తొలుత మొదలు పెట్టింది మీకు మంత్రి పదవి ఇచ్చిన వ్యక్తి(మోడీ)అంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ విషయం మీకు కూడా తెలిసినప్పటికీ దాని గురించి మాత్రం మీరు మాట్లాడటం లేదని సెటైర్ వేశారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా మాట్లాడుతూ జైశంకర్ బీజేపీ ఇచ్చిన పాత స్క్రిప్ట్ నే కొత్తగా చదువుతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోడీ విదేశీ గడ్డలపై గత ప్రభుత్వాలను ఎగతాళి చేసి దేశ 70 ఏళ్ల చరిత్రను అపహాస్యం చేసేలా వ్యాఖ్యలు చేశారని ఫైర్ అయ్యారు మన దేశంలో రాజ్యాంగ సంస్థలపై ప్రణాళిక బద్దంగా దాడి జరుగుతోందనే రాహుల్ గాంధీ నిజమే చెప్పారన్నారు.

Advertisement

Next Story