- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Malla Reddyకి చెక్? ఎమ్మెల్యేల తిరుగుబాటు వెనక గులాబీ బాస్
దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి మల్లారెడ్డికి చెక్ పెట్టేందుకు అధిష్టానం రంగం సిద్ధం చేసినట్లు తాజా పరిణామాలు సంకేతాలిస్తున్నాయి. అందుకే జిల్లాల ఎమ్మెల్యేలనంతా మల్లారెడ్డిపై ఊసిగొల్పారని ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే ఆయనపై అవినీతి ఆరోపణలు, ఐటీ అధికారుల దాడులు, మరోవైపు అల్లుడికి టికెట్తో పాటు ఐటీ అధికారుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో టచ్లో ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో మల్లారెడ్డికి చెక్ పెట్టేందుకే వ్యతిరేకంగా మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టించినట్లు విశ్వసనీయ సమాచారం. మల్లారెడ్డి వ్యవహారశైలీతో పార్టీకి నష్టం జరుగుతుందని భావించిన అధిష్టానం... ఇదే అదునుగా భావించి పొమ్మనలేక పొగపెడుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
వివాదాలకు కేంద్రబిందువు కేరాఫ్ మల్లారెడ్డి. ఆయన సమావేశాల్లో పాల్గొంటే జోకులు, డ్యాన్సులు, తొడగొట్టడాలు, సవాల్ చేయడం, విమర్శనాస్త్రాలు సందించడం ఆయనకు ఆయనేసాటి. అంతేకాదు మెడికల్ కాలేజీ డొనేషన్లు, భూముల కబ్జాలు వంటి ఆరోపణలు ఎప్పుడూ ఉండేవే. వీటికి తోడు ఐటీ దాడులు ఇలా పలు అంశాలు అన్నింటికీ ఆయనే కేరాఫ్ అడ్రస్. కేబినెట్లో ఇతర మంత్రులకు, బీఆర్ఎస్ నేతలకు భిన్నంగా కనిపించడానికి ఇవే ప్రధాన కారణం. నిత్యం ఏదో ఒక ఇష్యూతో ఉంటున్న మల్లారెడ్డి పార్టీకి తలనొప్పిగా మారారని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. ఆయన వ్యవహారశైలీ సైతం మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. జిల్లాలో పదవులు, పనులు విషయాల్లో ఆయన జోక్యం పెరిగిపోయిందని, తమ కేడర్ ఆందోళన చెందుతోందని, వారికి ఏం సమాధానం చెప్పుకోవాలని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. విమర్శలు చేస్తున్న వారంతా మంత్రి కేటీఆర్కు అత్యంత సన్నిహితులే. మల్లారెడ్డి వ్యవహారశైలీని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, అయినప్పటికీ మారకపోవడంతోనే భేటీ కావల్సి వచ్చినట్లు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
అధిష్టానం సూచనతోనే భేటీ అయినట్లు ఓ ఎమ్మెల్యే పేర్కొనడం గమనార్హం. ఒకసారి మేడ్చల్, మరోసారి తిరుపతిలో భేటీ కావడం పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. అసమ్మతి నేతలు ఇంత చేస్తున్నా హైకమాండ్ సైలెంట్ అందుకే ఏదైనా ఉంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలి కానీ, ఈ విధంగా బహిరంగ చర్చ పెట్టడాన్ని ఏ పార్టీ కూడా స్వాగతించదు. కానీ మంత్రి మల్లారెడ్డి విషయంలో స్పందించలేదు. ఒకవేళ పార్టీ అనుమతి లేకుంటే ఓ కేబినెట్ మంత్రికి వ్యతిరేకంగా భేటీ అయితే ఇప్పటికే అధిష్టానం చర్యలు చేపట్టి ఉండేది. వారికి ఆదేశాలు సైతం సీరియస్ గా ఇచ్చేది. కానీ వారం రోజులు గడుస్తున్నా అధిష్టానం మాత్రం స్పందించలేదు. మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు నిరసన గళం వినిపించడం వెనుక హైకమాండ్ ఉందని, అందుకే ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నట్లు చర్చ జరుగుతుంది.
బీజేపీతో టచ్ లో ఉన్నారనే ఆరోపణలు
ఒకవైపు తనకు ఏమీ కాదని, కేసీఆర్ అండగా ఉన్నారని, అంతా ఆయనే చూసుకుంటారనిపైకి ధీమా వ్యక్తం చేస్తున్నా లోలోనమాత్రం ఆందోళనలకు గురవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఐటీ అధికారులు మల్లారెడ్డి ఇళ్లు, ఆస్తులపై, మెడికల్ కళాశాలలో భాగస్వాములుగా ఉన్నవారిపై దాడులు నిర్వహించి నగదుతో పాటు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసింది. ఈ సమయంలో మల్లారెడ్డి ఐటీ అధికారులపై అనుచితంగా ప్రవర్తించడం, వారు తమ కుమారుడిని కొట్టారని కేసులు పెట్టడం, ఇక ఐటీ అధికారులు కూడా తమ ల్యాప్ టాప్ లాక్కున్నారని, తమ విధులకు విఘాతం కలిగించారని మల్లారెడ్డి పై కేసులు పెట్టడం తెలిసిందే. అంతేకాదు మల్లారెడ్డి ఆస్తులలో మనీలాండరింగ్ వ్యవహారాలు ఉన్నాయని ఈడీ అధికారులు వీటిపై విచారణ చేయాల్సిన అవసరం ఉందని, ఈడికి కూడా లేఖ రాసినట్టు సమాచారం. దీంతో మల్లారెడ్డి బీజేపీ నేతలకు టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం ఊపందుకుంది. అంతేగాకుండా ఆయన అల్లుడికి బీజేపీ టికెట్ కోసం సైతం సంప్రదింపులు జరిపారనే ఆరోపణలున్నాయి. ఈడీ అధికారులు దాడులు చేయకుండా, టికెట్ ఇప్పించుకునేందుకు బీజేపీలో చేరతారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చజరుగుతోంది. విషయం తెలిసిన బీఆర్ఎస్ అధిష్టానం మల్లారెడ్డిపై సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. అందుకే కేబినెట్ నుంచి ఉద్వాసన పలుకుతుందనే ప్రచారం సైతం ఊపందుకుంది.
క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధినేత
మేడ్చల్ జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నింటినీ పార్టీ అధినేత కేసీఆర్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి బీజేపీ నేతలకు టచ్లోకి వెళ్లారా? వెళ్తే వారు ఎలాంటి హామీలు ఇచ్చారు.. ఎలాంటి ప్రణాళికలు అనుసరిస్తున్నారు.. అనే వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. మల్లారెడ్డితో పార్టీకి ఎంతమేర నష్టం జరుగుతుంది... ప్రజల్లో ఎలాంటి టాక్ ఉందనే వివరాలను సైతం నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే మంత్రి పదవిని మల్లారెడ్డి డబ్బులు పెట్టి తెచ్చుకున్నాడనే విమర్శలు వచ్చాయి. ఏదీ ఏమైనప్పటికీ ఒకవైపు అవినీతి ఆరోపణలు, ఐటీ దాడులు, మరోవైపు రాబోయే ఎన్నికల్లో అల్లుడికి టికెట్ కోసం బీజేపీకి టచ్ లోకి వెళ్లారనే ప్రచారంతో మల్లారెడ్డిని బీఆర్ఎస్ నుంచి సాగనంపుతారనే ప్రచారం జోరందుకుంది. పార్టీలో సైతం ఇదే విషయం చర్చనీయాంశమైంది. ఏదీ ఏమైనప్పటికీ రాబోయే ఎన్నికల్లో పార్టీకి ఎలాంటి నష్టం జరుగకుండా అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తుంది. ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో చెక్ పెడుతుందా? లేకుంటే ఎపిసోడ్ నే ముగిస్తుందా అనేది చూడాలి.
Also Read...
BRS విస్తరణలో కాంగ్రెస్ కీలక నేత.. కేసీఆర్ కోసం ఢిల్లీలో లాబీయింగ్ షురూ!?