ఈడీ, బోడీకి BBC భయపడుతుందా?.. సీఎం కేసీఆర్

by Javid Pasha |   ( Updated:2023-02-12 10:48:48.0  )
ఈడీ, బోడీకి BBC భయపడుతుందా?.. సీఎం కేసీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: ఆదివారం అసెంబ్లీలో మాట్లాడిన సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీబీసీని భారత్ లో బ్యాన్ చేయాలన్న బీజేపీ నాయకులపై విరుచుకుపడ్డారు. (BBC)ని బ్యాన్ చేయాలని బీజేపీకి చెందిన లాయర్ సుప్రీంకోర్టులో కేసు వేశారని గుర్తు చేశారు. బీబీసీ(BBC) అంటే జీ న్యూసా ఈడీ దాడులు చేయగానే బంద్ చేయడానికి అని విమర్శించారు. గోద్రా అల్లర్లపై డాక్యుమెంట్ చేస్తే BBCని బ్యాన్ చేస్తారా అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైల్లో రూమ్ రెడీ చేశామని అంటున్నారని బీజేపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ పాలనలో దేశం బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక కంటే వెనుకబడి పోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక వ్యవస్థను గాడినపెడితే మోడీ సర్వనాశనం చేశారని ఫైర్ అయ్యారు. 2024 తర్వాత బీజేపీ ఖతం అని సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు.

Advertisement

Next Story