Breaking: పులివెందులకు చేరుకున్న సీఎం జగన్

by Indraja |   ( Updated:2024-04-25 05:36:32.0  )
Breaking: పులివెందులకు చేరుకున్న సీఎం జగన్
X

దిశ వెబ్ డెస్క్: వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల చేరుకున్నారు. ఉదయం 10 గంటలకు CSI గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడనున్నారు. అనంతరం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారని సమాచారం. కాగా ఆయన ఆర్వో కార్యాలయంలో నామొనిషన్ వేస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కోసం CSI గ్రౌండ్స్‌లో భారీ ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో సీఎం సభాప్రాంగణానికి చేరుకోనున్నారు. ఇప్పటికే సభాప్రాంగణానికి పెద్దఎత్తున నేతలు, కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. ఇక ఈ సభలో పులివెందులలో వైసీపీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి సీఎం జగన్ ప్రసంగించనున్నారు.

Advertisement

Next Story