Megastar: పవర్‌స్టార్ కోసం మెగాస్టార్.. పవన్ కళ్యాణ్ తరుపున చిరంజీవి ప్రచారం

by Disha Web Desk 3 |
Megastar: పవర్‌స్టార్ కోసం మెగాస్టార్.. పవన్ కళ్యాణ్ తరుపున చిరంజీవి ప్రచారం
X

దిశ,పిఠాపురం: అటు అసంబ్లీ, ఇటు సార్వత్రిక ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్‌లో సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రతి పార్టీ అడుగులేస్తోంది. ఈ క్రమంలో ప్రచార కార్యక్రమాలతో ఏపీ దద్దరిల్లుతోంది. ముఖ్యంగా అధికార పార్టీ, జనసేన,టీడీపీ ఎన్నికల ప్రచారంలో నువ్వా..? నేనా? అంటూ ముందుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ్ముడి గెలుపుకోసం తనవంతు ప్రయత్నం చేసేందుకు అన్నయ్య రెడ్డి అయ్యారు.

జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో పవన్ తరుపున పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మే నెల 5వ తేదీన ఆయన పిఠాపురంలో పర్యటించి జనసేన తరుపున ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు పద్మ విభూషణ్ మెగా స్టార్ చిరంజీవి , పవన్ కళ్యాణ్, నాగ బాబు అలానే అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రవణం స్వామి పాల్గొననున్నారని సమాచారం.

Read More..

మీడియాపై ఎన్టీఆర్ ఫైర్.. ఆయనకు ఎందుకు అంత కోపం వచ్చింది.. హోటల్ రూమ్‌లో ఏం చేశాడు..



Next Story

Most Viewed