Nagali Ramakrishna Reddy: టీడీపీ కీలక నేత మృతి.. సంతాపం తెలిపిన చంద్రబాబు

by Indraja |
Nagali Ramakrishna Reddy: టీడీపీ కీలక నేత మృతి.. సంతాపం తెలిపిన చంద్రబాబు
X

దిశ వెబ్ డెస్క్: ప్రొద్దుటూరు టీడీపీ సీనియర్ నేత నాగలి రామకృష్ణారెడ్డి మృతి చెందారు. కాగా ఆయన మృతిపట్ల టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలియ చేశారు. అలానే రామకృష్ణారెడ్డి కుటుంబసబ్యులకు ప్రగాడసానుభూతి తెలిపారు. అనంతరం పార్టీస్థాపించినప్పటి నుండి టీడీపీకి రామకృష్టారెడ్డి అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. రామకృష్ణారెడ్డి మృతి బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం జెండాలో నాగలి భాగమైన ఎన్టీఆర్ హయాం నుండి నేటి వరకు జరిగిన ప్రతి మహానాడులో బహుకరిస్తూ నాగలి రామకృష్ణారెడ్డిగా ప్రసిద్ధి చెందారని తెలిపారు. అలానే రామకృష్ణారెడ్డి ఆత్మకుశాంతి కలగాలని ప్రార్థించారు.

Advertisement

Next Story

Most Viewed