- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిసోడియాను కేజ్రీవాల్ బలి పశువును చేసిండు.. బీజేపీ నేత షెహజాద్ పూనావాలా
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ బలి పశువును చేశారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మనీశ్ సిసోడియాకు కేటాయించిన మధుర రోడ్డులోని అధికార నివాసాన్ని ఈ నెల 21 వరకు ఖాళీ చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం ఆయన కుటుంబ సభ్యులకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా, అమిత్ మాల్వీయ స్పందిస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై విమర్శలు గుప్పించారు. మనీశ్ సిసోడియాపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వివక్షతో వ్యవహరించారని అన్నారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టై 9 నెలల పాటు జైలులో ఉన్న సత్యేంద్ర జైన్ ను మంత్రిగా కొనసాగించారన్న వారు.. అరెస్ట్ కాగానే మనీశ్ సిసోడియా మంత్రి పదవి నుంచి తొలగించారన్నారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో మనీశ్ సిసోడియాకు అన్ని విధాల అండగా ఉంటామని కేజ్రీవాల్ సిసోడియా కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారని, కానీ ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరించారని అన్నారు. తొలుత మనీశ్ ను మంత్రి పదవి నుంచి తొలగించారని, తాజాగా ఆయన కుటుంబ సభ్యులను మంత్రి అధికార నివాసం నుంచి వెళ్లగొడుతున్నారని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు పాత్ర ఉందని వారు ఆరోపించారు. ఇక మనీశ్ అధికార నివాసాన్ని ఆయన స్థానంలో వచ్చిన ఆతీషీకి కేటాయిస్తూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్న మనీశ్ సిసోడియాను సీబైఐ గత నెల (ఫిబ్రవరి) 26న అరెస్ట్ చేసింది. దీంతో మనీశ్ సిసోడియా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇక ఈ కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవితతో పాటు రామచంద్ర పిళ్లై, బుచ్చిబాబు తదితరులు ఉన్నారు.