'ఆ విషయంలో కేసీఆర్‌ను కేటీఆర్ మించిపోయాడు'

by GSrikanth |
ఆ విషయంలో కేసీఆర్‌ను కేటీఆర్ మించిపోయాడు
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. హైదరాబాద్‌కు కేంద్రం వరద సహాయం చేసిందని, అయినా కేటీఆర్ అబద్దాల మీద అబద్ధాలు చెప్తున్నాడని ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడిన అర్వింద్.. వరద సహాయం కింద రూ.1200 నుండి 1300 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని స్పష్టం చేశాయి. ఇంత చేసినా కేంద్రం ఎలాంటి నిధులు అందజేయలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. హైదరాబాద్ వరదల సమయంలో కేంద్రం అందజేసిన నిధుల సంగతిని జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనే తెలుగు, ఇంగ్లీషులోనూ చెప్పామని, ముఖ్యమంగా కేటీఆర్‌కు ఇష్టమైన ఉర్దూ భాషలోనూ వివరించామని అయినా అబద్ధాలు చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పడంలో సీఎం కేసీఆర్‌ను మంత్రి కేటీఆర్ మించిపోయారని.. బాప్ ఏక్ నెంబర్ అయితే బేటా దస్ నెంబర్ అంటూ ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story