- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘వైఫల్యం బయటపడటంతో కేటీఆర్‌కు మైండ్ దొబ్బింది’
దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలో తన వైఫల్యం బయటపడటంతో కేటీఆర్‌కు మైండ్ దొబ్బిందని, ఏం మాట్లాడుతున్నరో ఆయనకే అర్థం కావడం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ మంగళవారం ఒక ప్రకటనలో ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో నిజాం షుగర్స్, రేయాన్స్, అజంజాహి, సిర్పూర్ కాగజ్ మిల్లులను తెరిపించడం చేతకావడం లేదని, కానీ వైజాగ్ స్టీల్‌లో వాటా పెడతామని బోగస్ మాటలు చెప్పడంపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి కేటీఆర్ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు బయ్యారం స్టీల్ అంశాన్ని కేంద్రంపైకి నెట్టే ప్రయత్నం చేశాడని విమర్శించారు. ఒడిశాలో ఉన్న ఐరన్ ఓర్‌లకు, ఏపీలో ఉండే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి, తెలంగాణకు సంబంధమేంటని ఆమె ప్రశ్నించారు.
విశాఖ స్టీల్, ఒడిశా ఐరన్ ఓర్ లేకపోతే తెలంగాణలో తినడానికి అన్నమే దొరకదనట్లుగా కేటీఆర్ మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఒడిశాలోని మైనింగ్‌లో ఎవరు బిడ్డింగ్ వేశారోనని, నిజంగా అక్కడ అవినీతి జరిగితే నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఎందుకు నోరు మూసుకుందని ఆమె ప్రశ్నించారు. నవీన్ పట్నాయక్‌కు తెలియని బైలడిల్ల మైనింగ్ కుంభకోణం మంత్రి కేటీఆర్‌కు ఎట్లా తెలిసిందో సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. టీఎస్ పీఎస్సీ ప్రశ్న పత్రాలు లీకై 30 లక్షల మంది నిరుద్యోగులు మనోవేదనతో ఉన్నారని, యువత మొత్తం కేసీఆర్ ప్రభుత్వంపై కసితో ఉందని ఆమె పేర్కొన్నారు. లీకు అంశాన్ని డైవర్ట్ చేసేందుకు కేటీఆర్ బైలడిల్ల పేరుతో కొత్త డ్రామాకు తెరదీశారన్నారు. తండ్రీకొడుకుల మాటలు నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని డీకే అరుణ విమర్శించారు.