రాజాసింగ్కు షాక్.. గోషామహల్ నుంచి బీజేపీ తరఫున ఆయన పోటీ?

by Javid Pasha |   ( Updated:2023-10-02 09:45:11.0  )
రాజాసింగ్కు షాక్.. గోషామహల్ నుంచి బీజేపీ తరఫున ఆయన పోటీ?
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ నేత విక్రమ్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తరఫున గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని బీజేపీ నేత విక్రమ్ గౌడ్ అన్నారు. ప్రస్తుతం బీజేపీ తరఫున అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ ఎంపీగా పోటీ చేస్తారని తెలిపారు. నరేంద్ర మోడీ అభిమానిగా ఆయన చేసిన అభివృద్ధి నచ్చి తాను బీజేపీలో చేరినట్లు విక్రమ్ గౌడ్ తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ లోని నేతలు పార్టీ కంటే తాము ఎక్కువగా పాపులర్ కావడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తమ నాన్న ముఖేశ్ గౌడ్ కరడుగట్టిన కాంగ్రెస్ వాది అని కానీ తాను ఆసుపత్రిలో ఉంటే ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఆయనను పరామర్శించలేదని అన్నారు. అందుకే తాను బీజేపీలోకి వెళ్లానని అన్నారు. గోషామహల్ ప్రజల కోసం నిరంతరం పని చేస్తున్నానని, బీజేపీ తరఫున గోషామహల్ నుంచి పోటీ చేస్తానని విక్రమ్ గౌడ్ అన్నారు. ఇంకా ఎన్నో విషయాలు విక్రమ్ గౌడ్ దిశ టీవీతో పంచుకున్నారు.

Also Read: ధరణి పోర్టల్తో రైతులకు కష్టాలు ఎందుకు?: సీనియర్ జర్నలిస్టు ప్రవీణ్ క్లారిటీ

Advertisement

Next Story