బండి సంజయ్ అరెస్ట్ పై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్

by Javid Pasha |   ( Updated:2023-04-05 04:28:06.0  )
బండి సంజయ్ అరెస్ట్ పై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ పై ఆ పార్టీ నేతలు బుధవారం తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బండి సంజయ్ ను అక్రమంగా అరెస్ట్ చేసిందంటూ అందులో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందునే ఆయనపై కేసీఆర్ ప్రభుత్వం కక్షసాధింపుకు దిగిందని ఆరోపించారు. అంతకు ముందు బండి సంజయ్ తనను అక్రమంగా అరెస్ట్ చేశారంట లోక్ సభ స్పీకర్ కు లేఖ రాశారు.

కాగా.. వరంగల్ లో టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీక్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బండి సంజయ్ కు అత్యంత సన్నిహితుడని బీఆర్ఎస్ ఆరోపించింది. లీకైన టెన్త్ క్లాస్ పేపర్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కూడా చేరిందని పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీక్ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాత్ర ఉందంటూ మంగళవారం రాత్రి కరీంనగర్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం అర్ధరాత్రి పూట యాద్రాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఇవి కూడా చదవండి: బొమ్మల రామారం పీఎస్ వద్ద ఎమ్మెల్యే రఘనందన్ రావు అరెస్ట్

Advertisement

Next Story

Most Viewed