- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్ణాటక ఎన్నికల ర్యాలీలో కీలక వ్యాఖ్యలు.. సోనియా గాంధీపై సీఈసీకి ఫిర్యాదు
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. కర్ణాటక ప్రతిష్ట, సార్వభౌమాధికారం, సమగ్రతకు ముప్పు కలిగించేలా కాంగ్రెస్ ఎవరినీ అనుమతించదని కర్నాటక ఎన్నికల సందర్భంగా జరిగిన ఓ ర్యాలీలో సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం ఢిల్లీలో ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. సోనియా గాంధీ వ్యాఖ్యలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. సోనియా గాంధీ ఉద్దేశపూర్వకంగా సార్వభౌమాధికారం అనే పదాన్ని ఉపయోగించారన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో 'తుక్డే-తుక్డే' గ్యాంగ్ ఎజెండా అని, అందుకే ఇలాంటి పదాలు వాడుతున్నారని మండిపడ్డారు. ఈ దేశ వ్యతిరేక చర్యపై ఈసీ చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు.