భూతాన్ని భూస్థాపితం చేస్తా.. భయం వీడి రాష్ట్రానికి రండి.. వాళ్లకు చంద్రబాబు పిలుపు

by Indraja |   ( Updated:2024-07-07 11:46:45.0  )
భూతాన్ని భూస్థాపితం చేస్తా.. భయం వీడి రాష్ట్రానికి రండి.. వాళ్లకు చంద్రబాబు పిలుపు
X

దిశ వెబ్ డెస్క్: తెలంగాణ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ఎన్‌టీఆర్ భవన్‌లో తెలంగాణ టీడీపీ శ్రేణులతో భేటీ అయ్యారు. తెలంగాణలో టీడీపీని బలోపితం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ శ్రేణులతో చర్చించినట్టు సమాచారం. ఈ నేసథ్యంలో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక సైకో భూతం పట్టుకుని వేలాడుతోంది అని అన్నారు.

దీని కారణంగానే ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వెనకడుగు వేస్తున్నారని తెలిపారు. అలానే ఆ భూతాన్ని భూస్థాపితం చేసే బాధ్యత తనదని, కనుక ఆ భూతం గురించి ఆలోచించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాల్సిందిగా పారిశ్రామిక వేత్తలను కోరారు. కాగా సీఎం చంద్రబాబు మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story