- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YSR Rythu Bharosa: రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: జగన్
CM Jagan Releases Ysr rythu bharosa amount in farmers accounts
దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్ రైతు భరోసా పథకం(YSR Rythu Bharosa Scheme) కింద రాష్ట్రంలో ప్రతి రైతుకు సంవత్సరానికి మూడు విడతల్లో రైతుల ఖాతాలో రూ.13,500 జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఏలూరు జిల్లా గణవరంలో నాలుగో ఏడాది తొలి విడత డబ్బును సీఎం జగన్(CM Jagan) వర్చువల్‌గా రైతుల అకౌంట్‌లో జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం మనది అన్నారు. గతంలో లేని విధంగా పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రైతు చరిత్రను మార్చే గొప్ప పథకాలకు శ్రీకారం చుట్టడమే మా లక్ష్యమని పేర్కొన్నారు. రైతు భరోసా కిందే రూ. 23,875 కోట్లు ఇస్తున్నామని వెల్లడించారు. అది క్రమం తప్పకుండా క్యాలెండర్ ప్రకారం అందిస్తున్నామని గుర్తు చేశారు. దేవుడి దయ వల్ల ఈ మూడేళ్లలో కరువు లేదని, ఈ మూడెళ్లలో ప్రతి రిజర్వాయర్‌లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. అలాగే ఈ మూడేళ్లలో భూగర్భజలాలు కూడా బాగా పెరిగాయన్నారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడాను గమనించాలని ప్రజలను కోరారు.