మరో ఐదుగురు జమ్ముకశ్మీర్ నేతలు హస్తానికి గుడ్ బై

by Naresh |   ( Updated:2022-08-26 11:56:10.0  )
మరో ఐదుగురు జమ్ముకశ్మీర్ నేతలు హస్తానికి గుడ్ బై
X

శ్రీనగర్: గులాం నబీ ఆజాద్ పార్టీని వీడిన గంటల వ్యవధిలో మరో ఐదుగురు జమ్ముకశ్మీర్ నేతలు కాంగ్రెస్ వీడుతున్నట్లు ప్రకటించారు. గులాం మహ్మద్ సరూరీ, హజీ అబ్దుల్ రషీద్, మహ్మద్ అమిన్ భట్, గుల్జర్ అహ్మద్ వాణీ, చౌదరీ అక్రం మహ్మద్, సల్మాన్ నిజామీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు. వీరంతా గులాం నబీ ఆజాద్‌కు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మాజీ కేంద్ర మంత్రి ఆర్‌ఎస్ చిబ్ కూడా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా లేఖను సమర్పించారు. దీంతో జమ్ముకశ్మీర్‌లో కాంగ్రెస్ కు కీలక నేతలను షాక్ ఎదురైంది. త్వరలో ఎన్నికలు జరగనుండడంతో ఇది మరి కాస్తా ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి : అతడి డీఎన్‌ఏ 'మోడీ-ఫైడ్' మారిపోయింది.. గులాం నవీపై జైరాం విమర్శలు..

Advertisement

Next Story

Most Viewed