- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'కేజ్రీవాల్‌కు అధికార నిషా తలకెక్కింది'
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశంలో ఇప్పటికే ఆమ్ ఆద్మీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ప్రముఖ ఉద్యమకారుడు అన్నాహజారే లేఖ రాయడం సంచలనం అయింది. ఢిల్లీ నూతన మద్యం పాలసీని ప్రస్తావిస్తూ కేజ్రీవాల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మద్యం లాగా అధికారం కూడా మత్తుగా ఉంటుందని ప్రస్తుతం కేజ్రీవాల్ కు అధికార నిషా తలకెక్కిందనంటూ' ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను మహారాష్ట్ర లాంటి మద్యం విధానం ఊహించాను కానీ ఢిల్లీలో అలా జరగలేదని అన్నారు. ఉద్యమం నుండి పుట్టుకు వచ్చిన ఓ పార్టీకి ఇలాంటి చర్య సరితూగదని వ్యాఖ్యానించారు. గతంలో కేజ్రీవాల్,అన్నా హజారే లోక్ పాల్ బిల్లు కోసం కరప్షన్ ఫ్రీ ఇండియా అంటూ పెద్ద ఎత్తున ఉద్యమం లేవెనెత్తిన సంగతి తెలిసిందే. అనంతరం కేజ్రీవాల్ రాజకీయ పార్టీని స్థాపించారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాక తొలి సారి లేఖను రాసిన అన్నా హజారే ఓ రేంజ్ లో విరుచుకుపడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మీ ప్రభుత్వ మద్యం పాలసీ గురించి ఇటీవలి వార్తా కథనాలపై నేను బాధపడ్డానని, మీ 'స్వరాజ్' పుస్తకంలో మద్యం విధానంపై ఆదర్శప్రాయమైన విషయాలు రాశారు. దాని కోసం ముందుమాట నా చేత వ్రాయించారు. ప్రాంత వాసుల అనుమతి లేకుండా మద్యం షాపులను తెరవకూడదన్న మీ ఆదర్శాలను ఇప్పుడు మీరే మర్చిపోయారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలోని ఏ ఇతర పార్టీకి భిన్నంగా లేదని పేర్కొన్నారు. మీరు తీసుకువచ్చిన మద్యం పాలసీ ప్రజలకు ముఖ్యంగా మహిళలకు వ్యతిరేకంగా ఉందని అన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో నగరం నలుమూలల మద్యం దుకాణాలు తెరవబడుతున్నాయని మండిపడ్డారు. ఢిల్లీలో మద్యం ఏరులై పారుతోందని విమర్శించారు. అన్నా హజారే లేఖతో బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీగా కొనసాగిన రాజకీయం ఇప్పుడు అన్నాహజారే వర్సెస్ కేజ్రీవాల్ గా మలుపు తీసుకునే ఛాన్స్ ఉందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగా బీజేపీ ఆందోళనలు దేశ రాజధానిలో రాజకీయ హీట్ పెంచాయి.
ఎలాగైనా నన్ను జైల్లో పెట్టాలనుకుంటున్నారు: సిసోడియా
లిక్కర్ పాలసీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీష్ సిసోడియా బ్యాంక్ లాకర్ ను సీబీఐ అధికారులు తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సిసోడియా సీబీఐ తనిఖీలే ఏమీ లభించలేదని చెప్పారు. దీంతో మోడీ తనకు క్లీన్ టీచ్ ఇచ్చినట్లు అయిందన్నారు. ఎలాగైనా సరే తనను జైల్లో పెట్టాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు.