- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాతీయ రాజకీయాల్లో KCRకు గట్టి షాక్
దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని ప్రయత్నాలు ముమ్మరం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తన మిత్రుడి నుంచి పోటీ తప్పేలా లేదు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా ఆవిర్భావం కావడంతో రాష్ట్ర రాజకీయాన్ని ఢిల్లీ వీధుల్లో పరుగులు పెట్టించాలని చూస్తున్న గులాబీ బాస్‌కు అయన మిత్రుడే షాక్ ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కేంద్రంలోని నరేంద్ర మోడీయే టార్గెట్‌గా నేషనల్ పాలిటిక్స్ చేయాలని చూస్తున్న కేసీఆర్‌కు అదే కాన్సెప్ట్‌తో బిహార్ సీఎం నితీష్ కుమార్ పోటీకి రాపోతున్నాడనే చర్చ జోరుగా వినిపిస్తోంది. ఈ మేరకు నితీష్ కుమార్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారాయి. నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యల వెనుక భారీ వ్యూహం ఉందని అదే నిజమైతే గనుక బీఆర్ఎస్ పేరుతో నేషనల్ పాలిటిక్స్ చేయాలని చూస్తున్న కేసీఆర్‌కు మైనస్‌గా మారే సూచనలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.
ఒక్కటి కాబోతున్న ఆ రెండు పార్టీలు?
బిహార్‌లో ఇటీవల అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత లాలు ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీతో జత కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ విధానాలపై ఆగ్రహంతో ఉన్న నితీష్ కుమార్ రాబోయే 2024 లోక్ సభ ఎన్నికలే టార్గెట్ గా భారీ వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా త్వరలో ఆయన ముఖ్యమంత్రి పదవిని వదులుకుని జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెడతారనే చర్చ జరుగుతోంది. ఇందుకు ఉదాహరణగా నితీష్ కుమార్ రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బిహార్ డిప్యూటీ సీఎం,ఆర్జేడీ యువ నేత తేజస్వీ యాదవ్ 2025లో ప్రభుత్వాన్ని లీడ్ చేస్తారని నితీష్ కుమర్ చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యల వెనుక వ్యూహం ముఖ్యమంత్రి మార్పు వరకే పరిమితం కాబోదని బీజేపీని ఎదుర్కొవడంతో పాటు బిహార్ లో ప్రభుత్వాన్ని మరింత సుస్థిరం చేసుకోవడం కోసం ఆర్జేడీ-జేడీయూ రెండు పార్టీలు విలీనం కాబోతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అక్కడ సాధించే విజయంతో జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలనే ప్లాన్ ఉన్నట్టు తెలుస్తోంది. రెండు పార్టీల విలీనం విషయంలో ప్రస్తుతానికి ఇరు పార్టీలు పైకి ఖండిస్తున్నా అంతర్గతంగా ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. విలీనం తర్వాత కొత్త పార్టీని నితీష్ కుమార్ సారథ్యం వహిస్తారని రాష్ట్ర బాధ్యతలు తేజస్వీ యాదవ్ చూసుకుంటే జాతీయ రాజకీయాల్లో నితీష్ జాతీయ స్థాయి రాజకీయల్లో ప్రణాళికలు రచించుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. జేడీయూ, ఆర్జేడీ రెండు విలీనమైతే ఆ రాష్ట్రంలో అతి పెద్ద రాజకీయ శక్తిగా అవతరించవచ్చని అలాగే కాంగ్రెస్, కమ్యూనిస్టులతో చేతులు కలపితే బీజేపీని మట్టికరిపించవచ్చనే వ్యూహంతోనే నితీష్ పక్కాగా లెక్కలు వేసుకుంటున్నారని.. ఈ మేరకు ఇటీవల బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చిన నితీష్ కుమార్ ఓ దఫా జాతీయ స్థాయి నేతలందరిని చుట్టి రావడం వెనకు ఇదే కారణం అనే టాక్ ఉంది. మరో వైపు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటి నుంచే బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి దిశగా ఆలోచనలు జరుగుతున్నాయి.
కేసీఆర్ సంగతేంటి?
నేషనల్ పాలిటిక్స్ లో అడుగుపెట్టిన కేసీఆర్ ఇక గతంలో ఉన్న పరిచయస్తుల సహకారంతో మరోసారి జాతీయ స్థాయిలో కీలకం కావాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నేషనల్ ఆఫీస్ ఓపెనింగ్ రోజున జేడీఎస్, ఎస్పీతో పాటు తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముందు ఎస్పీ అధినేత ములాయం సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 సాధారణ ఎన్నికల కోసం బిహార్ సీఎం నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీకి గట్టి ప్రయత్నాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారని వ్యాఖ్యానించారు. అయితే ఈ ముగ్గురు ఒంటరిగా బీజేపీని ఎదుర్కోవటం అసాధ్యం. అయితే కలిసి పని చేయడంపై ఈ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నారు. దాంతో వీరు కలిసి పని చేస్తారా లేక ఎవరికి వారు కలిసి వచ్చే పార్టీలతో ముందుకు సాగుతారా అనేది ఆసక్తిగా మారింది.
సంఖ్యా బలంతో చూస్తే ఈ మూడు రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్ లో 42 లోక్ సభ స్థానాలు ఉండగా బిహార్ లో 40 స్థానాలు ఉన్నాయి. ఇక తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఇందులో అన్ని స్థానాల్లో ఒకే పార్టీ గెలవడం అసాధ్యం. దాంతో ప్రయత్యామ్నాయ కూటమిలో సంఖ్య బలం ఆధారంగానే నేతలకు ప్రాధాన్యత ఉంటుందనేది రాజకీయ పండితులు చెబుతున్న మాట. నితీష్ కుమార్ పీఎం సీటు పై కన్నేశారనే చర్చ జరుగుతోంది. మరో వైపు నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అనే ఫ్యాక్టర్ తెరపైకి వస్తే అది నితీష్ కుమార్, మమతా బెనర్జీకి ఫేవర్ గా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్జేడీ, జేడీయూ విలీనం అయితే కనుక ఆ తర్వాత మోడీని ఎదుర్కొనేందుకు కూటమి ఏర్పాటు అయితే అందులో కేసీఆర్ రోల్ ఏంటనేది ఆసక్తిగా మారింది.
Also Read....