Politics: టార్గెట్ మార్చిన బీజేపీ.. వెలుగులోకి కొత్త మాట..

by Indraja |
Politics: టార్గెట్ మార్చిన బీజేపీ.. వెలుగులోకి కొత్త మాట..
X

దిశ వెబ్ డెస్క్: అటు సార్వత్రిక ఎన్నికలు, ఇటు అసెంబ్లీ ఎన్నికలతో దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం నెలకొంది. ముఖ్యంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లను కైవసం చేసుకుంటుందని భారత ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాగా పలు సందర్భాల్లో మోడీ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ 400 సీట్లు అని పలుమార్లు చెప్పారు.

అలానే ఇప్పటి వరకు అబ్ కీ బార్ 400 పార్ అనే నినాదంతో ఎన్డీయే కూటమి ముందుకు వెళ్తోంది. అయితే ప్రస్తుతం బీజేపీ టార్గెట్ మారింది. ఇప్పుడు బీజేపీ టార్గెట్ 399 సీట్లు మాత్రమే అనే ప్రచారం జోరుగా సాగుతోంది. వివరాల్లోకి వెళ్తే.. నిన్న గుజరాత్‌లోని సూరత్ పార్లమెంట్ స్థానం నుండి బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. దీనితో ఎన్డీయే నేతలు తమ నినాదాన్ని మార్చుకున్నారు.

అబ్ కీ బార్ 399 పార్ అనే నినాదంతో నిన్నటి నుండి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక నిన్న ముఖేష్ ఏకగ్రీవంగా ఎన్నికవడంతో 1951 నుండి ఇప్పటివరకు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీల సంఖ్య 35కు చేరింది.

Advertisement

Next Story