- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
YS షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు?
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్‌లో చేరబోతోందని వార్తలు విస్తృతం అయిన వేళ ఆమెకు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. షర్మిల చేరిక, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై ఆమెతో కాంగ్రెస్ పెద్దలు చర్చించనున్నట్లు సమాచారం. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ స్టార్ క్యాంపెయినర్‌గా బాధ్యతలు ఇవ్వడానికి హస్తం అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఇవాళ అధిష్టానంతో ఏపీ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో ఏపీ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఏపీ అసెంబ్లీ, లోకసభ ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు, ఏపీలో పొత్తులపై నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని పునరుత్తేజపరిచేలా నిర్ణయాలను అధిష్టానం తీసుకోనుంది.