సుప్రీంకోర్టులో ఉద్ధవ్ థాక్రేకు ఎదురు దెబ్బ

by Javid Pasha |   ( Updated:2023-02-22 11:17:48.0  )
సుప్రీంకోర్టులో ఉద్ధవ్ థాక్రేకు ఎదురు దెబ్బ
X

దిశ, వెబ్ డెస్క్: సుప్రీంకోర్టులో ఉద్ధవ్ థాక్రే వర్గానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏక్‌నాథ్ షిండే వర్గాన్ని అధికారిక శివసేనగా గుర్తిస్తూ భారత ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఉద్ధవ్ థాక్రే వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు స్టే విధించేందుకు నిరాకరించింది. "వారు (ఏక్ నాథ్ వర్గం) EC ముందు వాదనల్లో విజయం సాధించారు. ఈ దశలో ఆర్డర్‌పై స్టే ఇవ్వలేం" అని సుప్రీంకోర్టు తెలిపింది. తదుపరి విచారణను 2 వారాల తరువాత వాయిదా వేస్తూ దేశ అత్యున్న న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

కాగా విల్లు, బాణం గుర్తుతో ఏక్‌నాథ్ షిండే గ్రూపును శివసేనగా గుర్తిస్తూ ఎన్నికల సంఘం ఫిబ్రవరి 17న ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఉద్ధవ్ థాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా అంతకు ముందు ఈసీ ప్రధాని మోడీ చేతిలో బానిసలా మారిందని ఉద్ధవ్ థాక్రే మండిపడ్డారు. శివసేన పార్టీ, పార్టీ గుర్తును ఏక్ నాథ్ షిండే వర్గానికే కట్టబెట్టేందుకు రూ.2 వేల కోట్లు చేతులు మారినట్లు ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన సంజయ్ రౌత్ ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed