- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉమ్మడి కరీంనగర్‌కు మరోసారి రాజకీయ ప్రాధాన్యత
దిశ ప్రతినిధి, కరీంనగర్, ఓదెల: ఎమ్మెల్సీ పదవుల పందేరంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మరోసారి ప్రాధాన్యత దక్కింది. ప్రత్యక్ష్యంగా కరీంనగర్ జిల్లా కోటాలో పాడి కౌశిక్ రెడ్డికే అవకాశం దక్కినా.. పరోక్షంగా కూడా ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యత లభించింది. సిద్దిపేట కలెక్టర్‌గా పని చేస్తున్న వెంకట్రామిరెడ్డి పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందూర్తికి చెందిన వారు కావడం విశేషం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలను సీఎం కేసీఆర్ ఎంపిక చేయగా అందులో ఇద్దరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే కావడం స్థానికంగా సంతోషం వ్యక్తం అవుతోంది.
వెంకట్రామిరెడ్డి ప్రస్థానం..
ఓదెల మండలం ఇందూర్తికి చెందిన పరుపాటి వెంకట్రామిరెడ్డి తండ్రి రాజిరెడ్డి. ఆయన తండ్రి న్యాయవాదిగా పెద్దపల్లి జిల్లాలో సుపరిచతులు. 1996 గ్రూపు వన్ అధికారిగా ఎంపికైన ఆయన 2007 ఐఏఎస్ అధికారిగా పదోన్నతి పొందారు. ఆర్డీఓగా బందరు, చిత్తూరు, తిరుపతిలో పనిచేశారు. డ్వామా పీడీగా మెదక్, హుడా సెక్రటరీగా, జీహెచ్ఎంసీ జోనల్ కమీషనర్‌గా, ఇన్‌క్యాప్ ఇన్ఫ్రాస్టక్చర్ ఎండీగాను విధులు నిర్వర్తించారు. ఇటీవల మెదక్ జాయింట్ కలెక్టర్‌గా, సిద్దిపేట, సంగారెడ్డి, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికలు, టీఆర్ఎస్‌లో చేరిక నేపథ్యంలో ఆయన సిద్దిపేట కలెక్టర్ పదవికి రాజీనామా చేశారు.