- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పట్టు కోసం పట్టభద్రుల ఫైట్
దిశ ప్రతినిధి, రంగారెడ్డి : హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల కంటే ముందే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీలు దృష్టి సారించారు. కానీ, పార్టీలు ఉహించని విధంగా ప్రభుత్వం గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల నోటీఫికేషన్ విడుదల చేసింది. దీంతో ప్రధాన పార్టీలు షాక్ తిన్నాయి. అయినా బీజేపీ తమ బలాన్ని గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో సుస్పష్టం చేసింది. అయితే జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు పట్టు నిలబెట్టుకోవాలని ప్రయత్నాలు సాగిస్తున్నారు. గ్రేటర్ ఫలితాలతో బీజేపీ అదే ఉత్సహాంతో అడుగులు వేస్తోంది. ఏలాగైన సిట్టింగ్ ఎమ్మెల్సీ స్ధానాన్ని దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల ఫలితాలు పునరావృత్తం కాకుండా ఉండేందుకు తీవ్రంగా కృష్టి చేస్తోంది. ఎక్కడిక్కడ ఎమ్మెల్యేలు, విద్యార్థి సంఘాల నేతలు, మండల స్ధాయి నేతలు, ప్రజాప్రతినిధులను ఓటర్ నమోదు కార్యక్రమంలో నిమగ్నం కావాలని అధిష్ఠానం ఆదేశించింది. ఈ విధంగా పార్టీలు ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు.
టీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి..
మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం ఎన్నికను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో ఓటమిపాలైన టీఆర్ఎస్ తిరిగి నిలబెట్టుకునేందుకు వ్యూహాలు చేసుకుంటుంది. అంతేకాకుండా అభ్యర్ధి ఎంపికపై లోతైన పరిశీలిన చేస్తోంది. ఎందుకంటే గతంలో ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్‌ను రంగంలోకి దించడంతో బీజేపీ అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు బీజేపీ అభ్యర్ధిగా తిరిగి రామచందర్‌రావు ఉండే అవకాశం ఉండటంతో టీఆర్ఎస్ బలమైన అభ్యర్ధిని బరిలోకి దించాలని యోచిస్తోంది. నగర మేయర్ బొంతు రామ్మోహన్, వికారాబాద్ జిల్లాకు చెందిన నాగేందర్ గౌడ్ వంటి తదితర నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. కానీ చివరికి ఏవరీని బరిలోకి దింపుతారనే చర్చ తీవ్రంగా నడుస్తుంది.
బీజేపీలో పెరుగుతున్న జోష్…
దుబ్బాక ఉప ఎన్నికల్లో, హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికల్లో తమదైన శైలిలో ఫలితాలు రావడంతో బీజేపీలో జోష్ పెరిగింది. ఇదే జోష్‌ను కొనసాగించేలా పట్టభద్రుల ఎన్నికలపై దృష్టి పెట్టింది. ప్రతిపక్ష పాత్ర పోషించేది బీజేపీయేనని ప్రజలూ నిర్ధారణకు వచ్చారు. వచ్చే పట్టభద్రుల ఎన్నికల్లో తిరిగి బీజేపీ అభ్యర్ధిని గెలిపించుకోవాలని పార్టీ క్యాడర్ పక్క ప్రణాళికతో ముందకు పోతుంది. ప్రతి జిల్లాలో అంతర్గతంగా పట్టభద్రుల ఓటును నమోదు చేసే పనిలో నిమగ్నమైయ్యారు. వచ్చే నెల 8వరకు అభ్యంతరాలతోపాటు కొత్త ఓటు నమోదు చేసుకునే అవకాశం ఎన్నికల అధికారులు కల్పించారు.
వామపక్షాలతో కాంగ్రెస్ దోస్తీనా…?
ఖమ్మం, నల్లగొండ, వరంగల్, మహాబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎన్నికల్లో వామపక్షాలు తమ అభ్యర్ధులను ఇప్పటికే ప్రకటించారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం అభ్యర్థిగా జర్నలిస్టును, మహాబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ అభ్యర్థిగా రాజకీయ విశ్లేషకుడు నాగేశ్వర్ రావు పేర్లను సూచించారు. దీంతో ఈ అభ్యర్థుల గెలుపునకు వామపక్షాలు ఇప్పటికే సమీక్షలు, సమావేశాలు నిర్వహించి గెలిపించాలని కోరుతున్నారు. కానీ కాంగ్రెస్ వైఖరీ స్పష్టం కాకపోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు డైలామాలో ఉన్నారు. మరీ చివరికి వామపక్షాల అభ్యర్థికే కాంగ్రెస్, టీఆర్ఎస్ల మద్దతు ఇస్తుందా.. లేకపోతే ఓంటరిగా పోటీ చేస్తాయా వేచిచూడాల్సిందే.
ఓటరు జాబితా విడుదల…
వచ్చే నెల 8వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, కొత్త ఓటు నమోదుకు ఎన్నికల కమిషనర్ అవకాశం కల్పించారు. మహబూబ్‌నగర్ – హైదరాబాద్ – రంగారెడ్డి పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గం ఓటర్ల ముసాయిదా జాబితాను ఇటీవల విడుదల చేశారు. ఈ ముసాయిదా ప్రకారం పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో 4,48,961మంది ఓటర్లు నమోదయ్యారు. పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోకి వచ్చే 9జిల్లాల పరిధిలో చూస్తే రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కువ మంది నమోదు కాగా, తక్కువగా నారాయణపేటలో నమోదయ్యారు. అయితే అప్పటి వరకు కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగనుంది. వచ్చేనెల 22న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ప్రకటించిన ముసాయిదా ఓటర్ల సంఖ్య కంటే ఈ నెలాఖరు వరకు ఓటర్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్ కేంద్రాల సంఖ్యలో మార్పులు జరిగే అవకాశం ఉంది.