- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హుజురాబాద్‌లో పొలిటికల్ సందడి.. బిజీ బిజీగా నేతలు
దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఈటల రాజేందర్ రాజీనామా తరువాత కార్యరంగంలోకి దిగిన రాజకీయ పార్టీలు అడ్డాలు వెతుక్కునే పనిలో పడ్డాయి. హుజురాబాద్, జమ్మికుంట కేంద్రంగా ఉండేందుకు అనువైన లాడ్జీలు లేకపోవడంతో ఆయా పార్టీల నాయకులు ప్రైవేటు బిల్డింగులను వెతికే పనిలో నిమగ్నమయ్యారు. నేడో రేపో ఉప ఎన్నికలు జరగడం తప్పనిసరి కావడంతో ఇప్పటి నుంచే హుజురాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలను కొసాగించేందుకు టీఆర్ఎస్, బీజేపీలు అద్దె భవనాల కోసం ఆరా తీస్తున్నాయి.
కేవలం పార్టీ కార్యకలాపాలకే పరిమితం కాకుండా ఇక్కడకు వచ్చే ప్రముఖులు సేద తీరేందుకు అనువుగా ఉన్న భవనాలను వెతుకుతున్నారు. మాజీ ఎంపీ వివేక్ హుజురాబాద్ పట్టణంలో సపరేట్ బిల్డింగ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నటుగా తెలుస్తోంది. కీలక సమావేశాలు జరుపుకోవడంతో పాటు ఎన్నికల్లో వ్యూహలు రచించుకునేందుకు ముఖ్య నాయకులతో భేటీలు జరుపుకునేందుకు అనువుగా ఉన్న భవనం అద్దెకు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా హుజురాబాద్, జమ్మికుంట రహదారిలోని ఇందిరానగర్‌లో ప్రత్యేకంగా ఓ భవనం చూడాలని తన కేడర్‌కు సూచించినట్టు తెలుస్తోంది.
టీఆర్ఎస్ కూడా..
ఇక పోతే ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు భవనం రూపు రేఖలను మార్చిన నాయకులు.. ఇప్పుడు వీఐపీలు ఉండేందుకు అనువైన విధంగా బిల్డింగ్ కోసం ప్రయత్నిస్తున్నారు. దాదాపు 12 గదులు ఉన్న ఓ భవనాన్ని ఇప్పటికే సిద్దం చేసుకోగా, ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు సింగాపూర్‌లోని ఇంటిని కూడా టీఆర్ఎస్ ముఖ్య నాయకుల కోసం వినియోగించుకోవాలని భావిస్తున్నారు.
ఇంతకీ ఎన్నికలు జరిగేనా..
ఈటల రాజీనామాతో ఉప ఎన్నికలు అనివార్యమే అయినప్పటికీ ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందా అన్నదే క్వశ్చన్ మార్క్‌గా మారింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృత రూపం దాల్చడంతో పాటు రానున్న రెండు మూడు నెలల్లో థర్డ్ వేవ్ కూడా విజృంభించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో హుజురాబాద్‌లో బై పోల్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుందా.? అన్నదే అంతుచిక్కకుండా పోయింది. వచ్చే ఏడాదిలోనే ఈ ఎన్నికలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే అప్పటి వరకూ నియోజకవర్గంలో తిరుగుతూ ఓటర్లను మచ్చిక చేసుకోవడం కోసం అన్ని పార్టీలు ఎదురు చూడక తప్పని పరిస్థితే కనిపిస్తోంది.