జేసీ, హర్షవర్ధన్ వాగ్వాదం.. తాడిపత్రిలో ఉద్రిక్తత

by srinivas |
జేసీ, హర్షవర్ధన్ వాగ్వాదం.. తాడిపత్రిలో ఉద్రిక్తత
X

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్థన్ రెడ్డి మధ్య వాగ్వివాదం తాడిపత్రిలో ఉద్రిక్తతకు కారణమైంది.

ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. నామినేషన్లు వేసే టీడీపీ నేతలను అడ్డుకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వారికి అండగా నిలిచేందుకు తాడిపత్రి మున్సిపల్ కార్యాలయానికి జేసీ దివాకర్ రెడ్డి చేరుకున్నారు. కార్యాలయం బయట పోలీసులు ఆయనను అడ్డుకుని కార్యాలయంలో హర్షవర్ధన్ ఉన్నారని, ఆయన వెళ్లిన తరువాత లోపలికి పంపిస్తామని పరిస్థితిని జేసీకి వివరించారు. దానికి ఆయన ససేమిరా అన్నారు. ఇంతలో కార్యాలయం బయటకు హర్షవర్ధన్ రెడ్డి వచ్చారు.

ఈ నేపథ్యంలో జేసీ, హర్షవర్ధన్‌ వాగ్వివాదం చోటుచేసుకుంది. ఇరు వర్గాలు సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకోవడానికి తోడు ఆరోపణలు ప్రత్యారోపణలతో వాగ్వివాదం ముదిరింది. దీంతో ఉద్రిక్తతలు నివారించేందుకు ఇరు వర్గాల వారిని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. మరోవైపు తాడిపత్రిలో నామినేషన్‌ వేసి తిరిగి వెళ్తుంటే తమను వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి బెదిరించారంటూ 36వ వార్డు కౌన్సిలర్‌గా నామినేషన్ వేసిన టీడీపీ నేత జింకా లక్ష్మీదేవి నిరసనకు దిగారు.

tags : anantapur district, tadipatri, zp elections, jc diwakar reddy, harshavardhan reddy, zp office

Advertisement

Next Story