అన్నదాతలపై పోలీసులు దాష్టికం.. రైతులకు గాయాలు

by Shamantha N |
అన్నదాతలపై పోలీసులు దాష్టికం.. రైతులకు గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: అన్నదాతలపై పోలీసులు రెచ్చిపోయారు. లాఠీచార్జ్ చేయడంతో పాటు బాష్పవాయువు గోళాలు ప్రదర్శించారు. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. కరోనా ఆస్పత్రిని ప్రారంభించేందుకు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానాలోని హన్సికకు వచ్చారు. ఈ సందర్భంగా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు సీఎంను చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు.

దీంతో పోలీసులు ఇక రెచ్చిపోయి ప్రవర్తించారు. రైతులపై లాఠీచార్జ్ చేయడంతో పాటు బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు రైతులు గాయపడ్డారు.

Advertisement

Next Story