లాక్‌డౌన్ అమలుకు.. జోగిపేటలో ఏం చేశారంటే!

by Shyam |
లాక్‌డౌన్ అమలుకు.. జోగిపేటలో ఏం చేశారంటే!
X

దిశ, మెదక్: కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలును కఠినతరం చేశారు. రోడ్లపైకి జనం రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణాన్ని పూర్తిగా లాక్‌డౌన్ చేశారు. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది కలిసి రోడ్లకు అడ్డంగా బారికేడ్లు, కట్టెలను ఉంచారు. అంబేద్కర్ చౌరస్తా, గొల్ల సంఘం రోడ్డు, పోచమ్మ ఆలయం వైపు రోడ్డు, పాత కూరగాయల మార్కెట్ రోడ్డు, ప్రభుత్వ బాలికల పాఠశాల నుంచి ఎస్సీ కాలనీకి వెళ్లే రోడ్డు, బస్టాండ్ నుంచి 18వ వార్డులోకి వెళ్లే రోడ్లను పూర్తిగా మూసివేశారు. ఈ విషయమై జోగిపేట ఎస్సై వెంకటరాజ గౌడ్ మాట్లాడుతూ ఇష్టానుసారంగా బయట తిరగడాన్ని ఇక ఏ మాత్రం సహిందేది లేదన్నారు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని సూచించారు. మాస్కు లేకుండా ఎవరైనా రోడ్లపైకి వస్తే మున్సిపల్, రెవెన్యూ అధికారులు జరిమానాలు విధిస్తున్నట్టు తెలిపారు.

Tags: Medak,Jogipeta,Barricades,police

Advertisement

Next Story