- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మావోయిస్టులను పట్టిస్తే పారితోషికం.. పోలీసుల వాల్ పోస్టర్లు
దిశ ప్రతినిధి, కరీంనగర్ : నిన్న మొన్నటి వరకు పొరుగు రాష్ట్రానికే పరిమితం అయిన మావోయిస్టులు నెమ్మదిగా తెలంగాణాలోకి ఎంటర్ అయ్యారు. సాయుథ మావోలు సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు కొనసాగించే ప్రయత్నాల్లో మునిగిపోయారు. తాజాగా పోలీసులు కూడా సరిహద్దుల్లో వాల్ పోస్టర్లు అంటించడంతో మావోయిస్టుల ఉనికి వాస్తవమేనని స్పష్టం అవుతోంది.
భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పోలీసులు శనివారం వివిధ ప్రాంతాల్లో మావోయిస్టుల ఫోటోలతో వాల్ పోస్టర్లు అంటించారు. ‘సమాచారం మాకు, బహుమతి మీకంటూ’ ముద్రించిన వాల్ పోస్టర్లను వివిధ ప్రాంతాల్లో అంటించారు. ఈ నెల 26న మావోల బంద్ నేపథ్యంలో పోలీసుల అప్రమత్తం అయ్యారు. ఇందులో భాగంగానే సరిహద్దు ప్రాంతాల్లో సంచరిస్తున్న మావోయిస్టుల గురించి ప్రచారం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపున కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన, బస్టాండ్, రద్దీ ఉండే ప్రాంతాల్లో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని వివరాలు సేకరించి విచారించి వదిలేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మావోయిస్టులు కురుసం మంగు అలియాస్ భద్రు, దీపక్, మడకం సింగి అలియాస్ అనిత అలియాస్ శాంతిలు భూపాలపల్లి, మహా ముత్తారం, మహదేవపూర్, కాళేశ్వరం, కొయ్యూర్, పలిమెల అటవీ ప్రాంతాల్లో సంచారిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు వాల్ పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.