ఖైరతాబాద్ సర్కిల్‌ వద్ద పోలీస్ వాహనంలో మంటలు.. భారీగా ట్రాఫిక్ జామ్

by Shyam |   ( Updated:2021-08-04 01:30:58.0  )
Police-jjeep
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ ఖైరతాబాద్ చౌరస్తా సిగ్నల్ వద్ద ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా పోలీసు ఎస్కార్ట్ వాహనంలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. వాహనంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. వాహనంలో ఉన్న సిబ్బంది వెంటనే తేరుకొని దిగిపోవటంతో ప్రాణాపాయం తప్పింది.

అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వాహనంలో మంటలను అదుపులోకి తెచ్చారు. మార్నింగ్ టైం కావడం, ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ఖైరాతాబాద్‌ సర్కిల్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

police vehicle

Advertisement

Next Story