- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అందుకే హేమంత్‌ను చంపాం… అవంతి తండ్రి !
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: హేమంత్ కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపంతోనే హతమార్చినట్లు పోలీసుల విచారణలో అవంతి తండ్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నాడు. తమ పరువు, ప్రతష్ఠకు భంగం కలిగిందన్న అభిప్రాయంతోనే హేమంత్‌ను మట్టుబెట్టాలని నిర్ణయం తీసుకున్నామని గచ్చిబౌలి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. ఇందుకోసం స్థానికంగా ఉండే గ్యాంగ్ సాయం తీసుకున్నామని చెప్పాడు. హేమంత్‌ను పెళ్లి చేసుకుంటానని తమ కూతురు చెప్పడంతో ఇంటిచుట్టూ సీసీ కెమెరాలు పెట్టించానని, దాదాపు ఆరునెలలు తమ కూతురు బయటకు వెళ్లకుండా కంట్రోల్ చేసినట్లు పోలీసులకు తెలిపాడు. అయితే జూన్ 10న కరెంట్ పోయిన సమయంలో ఇంటి నుంచి అవంతి పారిపోయి హేమంత్‌ను కలిసి పెళ్లి చేసుకుందన్నాడు. అటు అవంతి మేనమామ యుగంధర్ నుంచి కూడా పోలీసులు చాలా విషయాలు రాబడుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో 22మంది నిందితులను గుర్తించారు.
‘జస్టిస్ ఫర్ హేమంత్’
హత్యకు గురైన హేమంత్ విషయంలో స్నేహితులు, సన్నిహితులు సంఘీభావం తెలిపారు. ‘జస్టిస్ ఫర్ హేమంత్’ నినాదంతో అతని ఇంటి దగ్గర సోమవారం సాయంత్రం ప్రదర్శన నిర్వహించారు. ఇకపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.
బెయిల్ ఇవ్వొద్దు: సీపీఐ నారాయణ
హేమంత్ హత్యకేసులో నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. నిందితుల తరపున లాయర్లు కూడా వాదించొద్దని విజ్ఞప్తి చేశారు. పోలీసు నిర్లక్ష్యం కారణంగా ఈ హత్య జరిగినందున ఇది సర్కార్ హత్యేనని విమర్శించారు. మిర్యాలగూడ సంఘటన తర్వాత కూడా పోలీసులు, ప్రభుత్వం పాఠం నేర్చుకోలేదని, ఈ హత్యతో అన్నివైపులా నష్టమే జరిగిందన్నారు.