- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తమ్మరను చుట్టుముట్టిన పోలీసులు.. ఉలిక్కిపడ్డ గ్రామస్థులు
దిశ,అనంతగిరి: అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని తమ్మర గ్రామంలో బుధవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కోదాడ డీఎస్పీ రఘు నేతృత్వంలో నలుగురు సీఐలు, 18 మంది ఎస్ఐలు, 12 మంది పోలీస్ సిబ్బంది కార్డన్ సెర్చ్‌లో పాల్గొన్నారు. గ్రామంలోకి వచ్చే ప్రధాన రహదారులను దిగ్బంధించి గ్రామంలోకి వచ్చి, వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అద్దెకు ఉంటున్న స్థానికేతరుల గుర్తింపు కార్డులు పరిశీలించారు. అలాగే వాహనాలకు సంబంధించిన పత్రాలను కూడా పరిశీలించారు.
ఉలిక్కిపడ్డ గ్రామ ప్రజలు?
తెల్లవారుజాము కావడంతో పూర్తి స్థాయిలో పోలీసులు గ్రామం మొత్తం చుట్టుముట్టడంతో గ్రామ ప్రజలకు ఏం జరుగుతుందో అర్థం కాక ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ రఘు గ్రామంలో నిర్వహిస్తున్న కార్డన్ సెర్చ్‌లో అనుమానిత వ్యక్తులను, సరైన పత్రాలు లేని వాహనాలను మాత్రమే అదుపులోకి తీసుకున్నట్లు, ప్రజల రక్షణ కోసమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రజలకు సూచించారు.
ప్రజలకు భరోసా కల్పించేందుకు..
ప్రజలకు భరోసా, ధైర్యం కల్పించడంతోపాటు నేరస్థులను పట్టుకునేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుందని డిఎస్పీ రఘు అన్నారు. వ్యక్తులకు ఇల్లు అద్దెకు ఇచ్చేందుకు పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఇవ్వాలని, అనుమానితులు గ్రామాలలో కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తమ్మరలో నిర్వహించిన కార్డన్ సెర్చ్ లో సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, 18 ఆటోలు, 2 కార్లు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నామన్నారు. ఇళ్లలో తనిఖీ చేస్తున్న సమయంలో దాదాపు 5 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ సత్యనారాయణ, సిఐలు, ఎస్ఐలు తదితర సిబ్బంది పాల్గొన్నారు.