- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ-తెలంగాణ బోర్డర్‌లో ఉద్రిక్తత..
X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బోర్డర్‌లో ఆంక్షలను మరోసారి మరింత కఠినతరం చేశారు పోలీసులు. ఏపీ నుంచి తెలంగాణలోకి వచ్చే వాహనాలకు ఈ-పాస్‌లు తప్పనిసరి చేశారు. లాక్‌డౌన్ సడలింపు సమయంలో ఈ-పాస్ ఉంటేనే వారిని రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. అంబులెన్స్‌లు, అత్యవసర వాహనాలకు మాత్రమే ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తున్నారు.
ఈ సందర్భంగా మఠంపల్లి, పులిచింతల, రామాపురం చెక్‌పోస్టులను పోలీసులు మూసివేశారు. కర్నూలు శివారు పుల్లూరు టోల్‌గేట్ వద్ద కూడా వాహనాలను పోలీసులు నిలిపివేస్తున్నారు. బైక్‌లు, ఆటోలను కూడా పోలీసులు ఆపుతున్నారు. అయితే, కేవలం కోదాడ మీదుగా మాత్రమే తెలంగాణలోకి ఏపీ నుంచి వాహనాలు వస్తున్నాయి. వాహనాల నిలిపివేత కారణంగా పలు చోట్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Advertisement
Next Story