బండి సంజయ్ వాహనాన్ని ఆపిన పోలీసులు

by Sridhar Babu |   ( Updated:2021-10-24 08:16:27.0  )
బండి సంజయ్ వాహనాన్ని ఆపిన పోలీసులు
X

దిశ, హుజురాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఆదివారం హుజురాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి కరీంనగర్ నుంచి ఇల్లందకుంట మండలానికి వెళ్తుండగా మార్గ మధ్యలో సింగాపూర్ వద్ద బండి కారును నిలిపివేసి పోలీసులు తనఖీ చేశారు. శనివారం కూడా ఎంపీ సంజయ్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. పోలింగ్ ముగిసే వరకు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపడతామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed