- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్లాస్ రూమ్‌గా.. పోలీస్ స్టేషన్
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా పోలీస్ స్టేషన్ అనగానే.. పోలీసు ఉన్నతాధికారులు, సీఐ, ఎస్ఐ, కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బందితో పాటు ఏదైనా సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారితో కాస్త హడావిడిగా ఉంటుంది. ఇంచు మించు అన్ని పోలీస్ స్టేషన్లలోనూ ఇదే సెటప్ కనిపిస్తుంది. కానీ, ఇక్కడో ఖాకీ నిలయం మాత్రం అందుకు భిన్నంగా, పిల్లల సందడితో కోలాహలంగా మారింది. టీచర్ల పాఠాలతో ఆ పీఎస్.. విద్యాలయంగా మారింది. అదెక్కడంటే..
మహారాష్ట్ర, ఔరంగాబాద్‌లోని పుండనాయక్ నగర్ పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల కొన్ని మురికివాడలు ఉన్నాయి. కాగా కొవిడ్ పాండమిక్ సమయంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా అక్కడి పిల్లలు పాఠశాలలకు దూరమయ్యారు. ఆన్‌లైన్ క్లాసులు వినే స్థోమత లేకపోవడంతో వారి చదువు అటకెక్కింది. ఈ పరిస్థితులు గమనించిన అధికారులు.. ఆ పిల్లలకు సాయపడాలని నిర్ణయించుకున్నారు. వాలంటీర్ టీచర్లను నియమించి స్టేషన్‌లోనే వారికి పాఠాలు చెప్పిస్తున్నారు. లాక్‌డౌన్ నుంచి కొవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. పీఎస్‌లో ప్రతిరోజూ గంటన్నరపాటు ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్ట్స్‌పై తరగతులు నిర్వహిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ జి. సొనవనె వెల్లడించారు. కాగా పిల్లలకు ఉచితంగా తరగతులు కండక్ట్ చేయడం పట్ల ఎస్పీ జావల్కర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్టేషన్ ఆఫీసర్లు, కానిస్టేబుళ్లను అభినందించారు. పిల్లలకు స్థానిక రిటైర్డ్ హెడ్ మాస్టర్ కూడా పాఠాలు బోధిస్తున్నారు.