రమ్యకృష్ణ కారులో మద్యం బాటిళ్లు స్వాధీనం

by Shyam |
రమ్యకృష్ణ కారులో మద్యం బాటిళ్లు స్వాధీనం
X

సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చెన్నై కానత్తుర్ సమీపంలో చేపట్టవిన వాహన తనిఖీల్లో భాగంగా పోలీసులు.. TN07Q 0099 నంబర్‌ గల రమ్యకృష్ణకు చెందిన ట‌యోటా ఇన్నోవా క్రిస్టా కారును కూడా తనిఖీ చేశారు. ఇందులో 96 బీర్, 8 లిక్కర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. డ్రైవర్ సెల్వ కుమార్‌ను అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న రమ్యకృష్ణ డ్రైవర్‌ను బెయిల్‌పై తీసుకెళ్లినట్లు సమాచారం.

కాగా రమ్యకృష్ణ ప్రస్తుతం తన భర్త కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండ సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు మరిన్ని ప్రాజెక్ట్‌లు కమిట్ కాగా.. షూటింగ్స్ మొదలుకాగానే బిజీ అయిపోనుంది.

Advertisement

Next Story