వాగులో చెట్టును పట్టుకుని… మూడు గంటలపాటు కేకలు

by Shyam |   ( Updated:2020-08-18 04:44:36.0  )
వాగులో చెట్టును పట్టుకుని… మూడు గంటలపాటు కేకలు
X

దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని అన్ని వాగులు, చెరువులు నిండి భారీ వరదలు పారాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అంతేగాకుండా అక్కడకక్కడా కొంతమంతి వాగులు దాటే ప్రయత్నం చేసి, ప్రమాదాల్లో చిక్కుకున్నారు.

తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా డోర్నకల్ మండలం మోదులగడ్డ తండాలో ఆకెరు వాగు పొంగి ప్రవహిస్తోంది. వాగు ఉధృతిలో చిక్కుకున్న ఇద్దరు రైతులను పోలీసులు స్థానికుల సహాయంతో కాపాడారు. రెండు గంటలపాటు శ్రమించి తాళ్ల సాయంతో బాధితులను రక్షించారు. ఆకెరు వాగు ఉన్న వ్యవసాయ భూములవద్ద విద్యుత్ మోటారు పనిచేయలేదు.

వివరాళ్లోకి వెళితే… మరమ్మతులు చేసేందుకు వెళ్లిన ఇద్దరు రైతులు వరద ఉధృతిలో కొట్టుకుపోయారు.
వాగు మధ్యలో ఉన్న చెట్టును పట్టుకుని 3 గంటలపాటు అలాగే ఉండి తమను రక్షించాలంటూ కేకలు వేశారు. వారిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వాగువద్దకు వచ్చిన పోలీసులు బాధితులను కాపాడారు.

Advertisement

Next Story

Most Viewed