- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం.. రివర్స్‌లో భర్తపై కేసు
దిశ, వెబ్‌డెస్క్ :
ఆమె ఒకరి భార్య. అంతే కాదు బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తోంది. నలుగురికి మంచి చెప్పాల్సిన ఆమెనే కట్టు తప్పింది. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా, దానిపై ప్రశ్నించినందుకు కట్టుకున్న భర్తపై తిరిగి రివర్స్‌లో కేసు పెట్టింది. నాటి నుంచి పోలీసులు అతన్ని హింస్తున్నారని బాధిత వ్యక్తి వాపోయాడు.
ఇదంతా ఒకఎత్తయితే, గుట్టుచప్పుడు కాకుండా భార్య సాగిస్తున్న అక్రమ సంబంధాన్ని ఆమె భర్త బట్టబయలు చేశాడు. పోలీసులను, మీడియాను వెంటబెట్టుకుని మరి ఆ మహిళ చేస్తున్న అకృత్యాలను బయటి ప్రపంచానికి చూపించాడు. ఈ ఘటన రామాంతాపూర్‌లోని ఇంద్రానగర్‌లో గురువారం వెలుగులోకి వచ్చింది.
డోర్ తెరచి చూసిన ఆ మహిళ మీడియాను, పోలీసులను చూడటంతో తప్పించుకునేందుకు యత్నించింది. అది సాధ్యం కాకపోవడంతో తాను పని మీద ఫ్రెండ్ ఇంటికి వచ్చానని, అంతకుమించి మా ఇద్దరి మధ్య ఏమీ లేని బుకాయించసాగింది. కవరేజ్ చేస్తున్న మీడియా వారిని కూడా అసభ్య పదజాలంతో దూషించింది.
ఆ వివాహిత ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో మెడికల్ విభాగంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. కొద్దిరోజులుగా భర్తను దూరం పెడుతూ జయరాం అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వస్తోంది. ఈ విషయాన్ని ప్రశ్నించినందుకు తనపై 498A కేసు పెట్టిందని బాధిత భర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.దీంతో వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం పోలీసుస్టేషన్‌కు తరలించారు. కాగా, తాను ఏ తప్పు చేయలేదని తనపై పెట్టిన కేసును తీసేయాలని ఆవిడ భర్త మీడియా ఎదుట పోలీసులను వేడుకున్నాడు.