బెల్ట్ షాపులపై పోలీసుల దాడులు.. భారీగా మద్యం..

by Aamani |
బెల్ట్ షాపులపై పోలీసుల దాడులు.. భారీగా మద్యం..
X

దిశ, మంచిర్యాల : జిల్లా కేంద్రంలోని మూడు బెల్ట్ షాపులపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. రామగుండం పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ ఆదేశాల మేరకు డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ అఖిల్ మహాజన్ ఉత్తర్వుల ప్రకారం పట్టణ సీఐ ముత్తి లింగయ్య పర్యవేక్షణలో ఎస్సైలు దేవయ్య, ప్రవీణ్ కుమార్‌లు సిబ్బంది‌తో కలిసి బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ నగర్‌లో సుమారు రూ. 4, 300, ఎఫ్‌సీఐ గోదాం ఏరియాలో సుమారు రూ 14, 500, ఏసీసీ ఏరియాలో రూ. 24,770 వేల విలువ గల మద్యం పట్టుకున్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా బెల్ట్ షాపుల్లో మద్యం అమ్ముతున్న ఈగారపు బాపు, వావిలాల సత్యం, పిట్టల వెంకటస్వామి అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ కోసం పట్టుకున్న మద్యం, నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేశారు.

Advertisement

Next Story