వ్య‌భిచారం గృహంలో దాడులు.. ఇద్ద‌రు అరెస్ట్

by Sridhar Babu |
వ్య‌భిచారం గృహంలో దాడులు.. ఇద్ద‌రు అరెస్ట్
X

దిశ‌, కొత్త‌గూడెం: భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సెంటర్‌లోని దాట్ల లాడ్జిలో వ్యభిచారం చేస్తున్న మ‌హిళ‌తో పాటు విటుడిని పోలీసులు సోమ‌వారం అదుపులోకి తీసుకున్నారు. లాడ్జిలో వ్య‌భిచారం జ‌రుగుతోంద‌న్న పక్కా సమాచారంతో సోమవారం వన్‌టౌన్ ఎస్సై రాఘవ ఆయన బృందంతో అక్క‌డికి చేరుకున్నారు. సూపర్వైజర్‌ని విచారించగా అలాంటి అసాంఘిక కార్యకలాపాలు ఈ లాడ్జిలో జరగవని బుకాయించారు. అనుమానం వచ్చిన ఎస్ఐ గదులు తనిఖీ చేయ‌గా మ‌హిళ‌తో పాటు ఓ వ్య‌క్తిని రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. ఇద్ద‌రిని పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

Advertisement

Next Story

Most Viewed