- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నర్మద ఘాట్‌లో స్నానం.. గుంజీలు తీయించిన పోలీసులు
దిశ, వెబ్ డెస్క్ : కరోనా సెకండ్ వేవ్ శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ క్రమంలో కరోనా కట్టడి చేయడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ మంత్రం జపించాయి. ఈ లాక్ డౌన్ ను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా అమలు చేస్తున్నాయి. లాక్ డౌన్ నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వాలు ముందుగానే చెప్పాయి. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన వారికి పోలీసులు తగిన శిక్షలు విధించారు.ఈ క్రమంలో భోపాల్ లోని ఖర్గో జిల్లాలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి పోలీసులు వేసిన శిక్ష ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళ్లితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ విధించి అందరూ కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖర్గోన్ జిల్లాలోని మహేశ్వర్ లోని నర్మద ఘాట్‌లో కొంతమంది వ్యక్తులు స్నానాలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నర్మద ఘాట్ వద్దకు చేరుకున్నారు. చేతుల్లో లాఠీలు పట్టుకుని వారి చేత గుంజీలు తీయించారు. అక్కడనే ఉన్న కొంతమంది దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.