రైతు భరోసా దీక్ష భగ్నానికి పోలీసుల యత్నం.. ఎంట్రీ ఇవ్వనున్న విజయశాంతి ?

by Aamani |   ( Updated:2021-09-13 03:43:33.0  )
రైతు భరోసా దీక్ష భగ్నానికి పోలీసుల యత్నం.. ఎంట్రీ ఇవ్వనున్న విజయశాంతి ?
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో ముంపుకు గురవుతున్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలన్న డిమాండ్‌తో బీజేపీ రైతు భరోసా దీక్ష చేపడుతోంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజక వర్గంలోని కోటపల్లి జైపూర్ మండలాల రైతులతో బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరా‌పార్కు వద్ద సోమవారం రోజు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపు భూముల రైతులు దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో ఇందిరా పార్కు‌కు వెళ్లకుండా చెన్నూరులో పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి వుండి కూడా పోలీసులు అడ్డుకోవడం‌పై బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ పోలీసుల ద్వారా హైదరాబాద్‌కు తమను వెళ్లకుండా చేశాడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో పోలీసులు పెద్దఎత్తున రైతులు, బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులకు రైతులు, బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ విజయశాంతి చెన్నూరు వచ్చే అవకాశాలున్నాయని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed