- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మానవత్వం మరిచినారు.. ఊరిచివర వదిలారు
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాడవం చేస్తుంది. ఈ కరోనా కాటుకు ఎంతో మంది బలవుతున్నారు. ఈ నేపథ్యంలో మానవత్వం అనేది మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు జనాలు. నవమాసాలు మోసి కన్న తల్లిదండ్రులను కూడా పట్టించుకోని పరిస్థితులున్నాయి. ఎంతోమంది కరోనా రోగులను కన్నవారే నడి రోడ్డు మీద వదిలి వెళ్తున్న వైనం. ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లా, తిరువూరులో మానవత్వం మంట గలిసింది. కరోనా తో మృతి చెందిన వ్యక్తి ని రోడ్డు మీద వదిలి వేసి వెళ్లిపోయారు. వివిరాల్లోకి వెళ్లితే.. తిరువూరు మండలం మునుకుళ్ళ గ్రామానికి షేక్ సుభాని రెండు రోజులక్రితం కరోనా పాజిటీవ్ వచ్చింది. దీంతో అతన్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కానీ ఆరోగ్యం విషమిచడంతో చికిత్స పొందుతూనే మరణించాడు. దీంతో ఆసుపత్రి సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలుపగా వారు అంబులెన్సకు ఫోన్ చేశారు. కానీ ఆ అంబులెన్స్ శవాన్ని ఊరి చివరన వదిలేసి వెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని, దగ్గర ఉండి దహానసంస్కారాలకు కావలసిన ఏర్పాటు చేశారు. ఈ అంతిమయాత్రలో తిరువూరు సిఐ యం. శేఖర్ బాబు, ఎస్సై సుబ్రహ్మణ్యం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఘటన అందరిని కలిచివేసింది.